Teja Sajja: అయ్యయో.. అందరి ముందు తేజ బుగ్గలు గిల్లిన స్టార్ డైరెక్టర్ 😍! ప్రోమో అదిరింది

స్టార్ హీరో జగపతిబాబు 'జయంబు నిశ్చయంబు' టాక్ షోలో ' మిరాయ్' టీమ్  సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.   జగపతి బాబు- తేజ-  కలిసి నటించిన  'బాచీ' సినిమాలోని ''డాడీ.. డాడీ''  డైలాగ్ తో తేజ ఎంట్రీ ప్రేక్షకులను అలరించింది.

New Update

Teja Sajja: ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సీనియర్ హీరో జగపతిబాబు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ షో జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారంలో ప్రసారం అవుతోంది. ఇందులో హోస్ట్ ప్రముఖ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తారు. వారి సినీ ప్రయాణం, కెరీర్, వ్యక్తిగత విషయాలు, జీవితంలో మర్చిపోలేని సంఘటనల గురించి ఈ షోలో ముచ్చటిస్తారు. ఇప్పటికే కింగ్ నాగార్జున, శ్రీలీల, నాని, సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖ స్టార్స్ ఈ షోలో పాల్గొనగా .. తాజాగా మరో కొత్త సెలబ్రిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు జగపతి బాబు.

మిరాయ్ టీమ్ సందడి

యంగ్ హీరో తేజ సజ్జా మిరాయ్ టీమ్ సందడి చేసింది. తేజ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత విశ్వ ప్రసాద్ షోలో గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.   జగపతి బాబు- తేజ-  కలిసి నటించిన  'బాచీ' సినిమాలోని ''డాడీ.. డాడీ''  డైలాగ్ తో తేజ ఎంట్రీ ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు ఈప్రోమోలో  స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మరో సర్ప్రైజ్ ఎంట్రీ  అందరినీ ఆకట్టుకుంది. గుణశేఖర్ రాగానే తేజ బుగ్గలు గిల్లడం తనకు చాలా ఇష్టమంటూ.. బుగ్గలు పట్టుకొని గిల్లడం భలే క్యూట్ గా అనిపించింది. ఆ తరువాత 'చూడాలని ఉంది' సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తేజను ఎలా సెలెక్ట్ చేశారు అనే విషయాన్ని పంచుకున్నారు. చూడాలని ఉంది చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే... తేజ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ.. ఇప్పుడు 'మిరాయ్' తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నెల12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కథా, కథనం, టెక్నికల్ అంశాలు అన్నీ బాగున్నాయని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా vfx అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తక్కువ బడ్జెట్ లో నాణ్యమైన vfx అందించడాన్ని అభినందించారు.

కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. గౌరిహరి సంగీతం అందించారు. మిరాయ్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా విలన్ మంచు మనోజ్ ఎంట్రీ టైంలో బీజీఎం అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు.అశోకుడి కాలం నాటి తొమ్మిది పురాతన గ్రంథాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిచారు. ఇందులో తేజ సజ్జ సూపర్ యోధ గా కనిపించగా .. మంచు మనోజ్ విలన్ గా నటించారు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. శ్రేయ, జగపతి బాబు, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Advertisment
తాజా కథనాలు