Idli Kottu Trailer: ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల అనుభందం, వారి ఇడ్లీ కొట్టు వ్యాపారం చుట్టూ సాగిన ఈ ట్రైలర్ ఎమోషనల్ గా అనిపించింది. ఇందులో ధనుష్ ఒక చెఫ్ పాత్రలో కనిపిస్తారు. అతడి తండ్రి గ్రామంలో ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతుంటారు. ఆ ఇడ్లీ కొట్టు అంటే ఆయనకు ప్రాణం! కానీ ధనుష్ మాత్రం నాన్న ఇడ్లీ కొట్టును వదిలేసి పట్టణానికి వెళ్లి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగం మొదలు పెడతాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ధనుష్ మనసు మాత్రం ఊరులోని ఇడ్లీ కొట్టు పైనే ఉంటుంది. తండ్రి మరణానంతరం ఆ ఇడ్లీ కొట్టు మూతపడుతుంది. అప్పుడు మురుగన్ తిరిగి ఊరికి వచ్చి తమ ఇడ్లీ కొట్టును తిరిగి తెరవాలని నిర్ణయించుకుంటాడు.ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం, అలాగే అరుణ్ విజయ్ తో శత్రుత్వం వంటి అంశాలు ట్రైలర్ లో ఆసక్తిని రేకెత్తించాయి.
ట్రైలర్ లో "మెషిన్లతో అన్నీ చేసేయొచ్చు అంటారు కానీ రుచి అనేది మాత్రం... మనసు పెడితేనే వస్తుంది", "జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు.. ఆస్వాదిస్తూ కూడా చేయాలి" వంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి సినిమాలోని భావోద్వేగాన్ని, సందేశాన్ని తెలియజేస్తున్నాయి.