Dhanush 54: ధనుష్ కొత్త ప్రాజెక్ట్.. ఆసక్తిరేపుతున్న ట్యాగ్ లైన్! పోస్టర్ వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులు, విజయాలతో దూసుకెళ్తున్నారు.  తాజాగా తన 54వ  చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
dhanush 54 new project

dhanush 54 new project

Dhanush 54: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులు, విజయాలతో దూసుకెళ్తున్నారు.  తాజాగా తన 54వ  చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ధనుష్ ఒక కాలిపోయిన పత్తి పొలం ముందు నిలబడి ఉన్నారు. ''కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండటమే బ్రతకడానికి ఏకైక మార్గం'' అనే ట్యాగ్ లైన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్ చూస్తుంటే థ్రిల్లర్, క్రైమ్,  భావోద్వేగ డ్రామా కలయికగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ప్రేమలు బ్యూటీ

"పోర్ తొళిల్" సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగాయి. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఈషరి కె. గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ జోడీగా ప్రేమలు బ్యూటీ మమిత బైజూ హీరోయిన్ గా నటిస్తోంది.  జయరామ్, సూరజ్ వెంజరమూడు,  కే.ఎస్. రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండియరాజన్ తదితరులు  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  జీవీ ప్రకాష్ కుమార్  సంగీతం అందిస్తున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్  త్వరలోనే ప్రారంభం కానుంది. 

Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు