Devara : 'యానిమల్' డైరెక్టర్ తో 'దేవర' ఇంటర్వ్యూ.. ప్రోమో అదుర్స్

‘యానిమల్‌’ డైరెక్టర్ తో ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 35రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు.

New Update
devra interview

Devara Special Interview :

'దేవర' ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతుంది. మొన్నటిదాకా ముంబైలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవ్వగా.. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది.

ఇందులో ఎన్టీఆర్, కొరటాల శివతో పాటూ బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో 35రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. అలాగే ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్ చేశారు. ఈ చిట్ చాట్ కు సంబంధించిన ఫుల్ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు దేవర కోసం తెలుగులో మరికొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు. ,మన టాలీవుడ్ యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ తో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తుండగా ఓ ఫోటో మూవీ యూనిట్ డైరెక్ట్ గా లీక్ చేసి మాసివ్ ఇంటర్వ్యూ రాబోతుంది అని హింట్ ఇచ్చింది.

విశ్వక్ సేన్, సిద్దూ ఇద్దరూ తారక్ బాగా క్లోజ్. విశ్వక్ అయితే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ వీరాభిమాని అని తెలిసిందే. గతంలో విశ్వక్ సినిమా ఈవెంట్స్ కి ఎన్టీఆర్ వచ్చాడు. అటు ‘టిల్లు స్క్వేర్’ మూవీ టైంలో ఈ ముగ్గురు కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు