''మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా''.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ట్వీట్

నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'దేవర' కు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా NTR అభిమానులను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చిందని. ఫ్యాన్స్ చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు.''

ntr (2)

Ntr

New Update

NTR Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దేవర'  నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత తారక్ సోలోగా..  భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది.  అంచనాలకు తగ్గట్లే జూనియర్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ సందర్భంగా తారక్ సినీ ప్రియులకు, అభిమానులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఎన్టీఆర్ ట్వీట్ 

"నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది.  ఇంత ఆకర్షణీయమైన డ్రామా, భావోద్వేగాలతో 'దేవర' ను తీర్చిదిద్దినందుకు కొరటాల శివకు  ధన్యవాదాలు. మై బ్రదర్ అనిరుధ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 'దేవర' ప్రపంచానికి ప్రాణం పోశాయి. నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని సినిమాకు బలమైన  పిల్లర్స్ గా నిలిచినందుకు ధన్యవాదాలు. అలాగే అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు సిరిల్‌తో పాటు టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా  'దేవర' కోసం నా అభిమానుల వేడుకలు చూసి మనసు  నిండిపోయింది. మీ ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను  ఎంజాయ్ చేసినంతగానే.. మీరు కూడా చిత్రాన్ని ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉంది. ఇకపై కూడా మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అని తారక్ ట్వీట్ చేశారు." 

 

Also Read: HariHaraVeeraMallu: ‘హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్.. బంగారు చీరలో మెరిసిపోతున్న నిధి అగర్వాల్‌ - Rtvlive.com

#devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి