ఓవర్సీస్ లో 'దేవర' ర్యాంపేజ్.. రిలీజ్ కు ముందే రికార్డులు

'దేవర' సినిమా ఓవర్సీస్ లో అరుదైన రికార్డు నమోదు చేసింది. నార్త్‌ అమెరికా ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్‌ మార్క్‌ను దాటేసింది. ప్రభాస్ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. కాగా USA లో 'దేవర' ప్రీమియర్స్‌ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి.

New Update
devara pri sales

Devara Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ పార్ట్-1 సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర ఫీవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అటు ఓవర్సీస్ లోనూ ఇదే ఫీవర్ కొనసాగుతోంది. 

ఈ సినిమా ప్రీ సేల్స్  లో అరుదైన రికార్డు నమోదు చేసింది. నార్త్‌ అమెరికాలో 'దేవర' ప్రీ సేల్స్‌లో 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేసింది.  ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. 

రెండో హీరోగా రికార్డ్..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తర్వాత వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ నటుడిగా తారక్ నిలవడం విశేషం. టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్ తప్ప మరే హీరో సినిమా నార్త్ అమెరికాలో రిలీజ్ కు ముందే 2 మిలియన్ మార్క్ టచ్ చేయకపోవడం గమనార్హం. దీన్ని బట్టి ఓవర్సీస్ లో 'దేవర' క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా యూఎస్‌ఏలో 'దేవర' ప్రీమియర్స్‌ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి.

అమెరికాలో తారక్..

ఇక 'దేవర' ప్రమోషన్స్‌ కోసం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లారు. లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌లో ఆయన పాల్గోనున్నారు. ఆ ఈవెంట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా ఎన్టీఆర్‌ ‘దేవర’ నిలిచిన సంగతి తెలిసిందే. చిత్రోత్సవాల్లో భాగంగా ఈనెల 26న అమెరికాలోని ప్రఖ్యాత ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రీమియర్‌గా ‘దేవర’ను ప్రదర్శించనున్నారు. దీనికోసం ఎన్టీఆర్‌ ఇప్పటికే లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు