యాక్షన్ తో అదరగొట్టిన ఎన్టీఆర్.. 'దేవర' రిలీజ్ ట్రైలర్ చూశారా?

'దేవర' మూవీ నుంచి తాజాగా రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అనిరుద్ బీజీయం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది.

devara release
New Update

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 27 పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. 

ఇప్పటికే రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఉండ‌డంతో ఈసారి తారక్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

Also Read : ఆ బిజినెస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ .. రెండు చేతులా సంపాదన

ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ...

'నిన్న రాత్రి ఓ పీడ కల వచుండాది జోగుల.. సముద్రం మళ్ళీ ఎరుపెక్కి ఎర్ర సముద్రం అయినట్టు. అదీ నా చేతుల మీదుగా అయినట్లు కనిపించుండాది' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. అనంతరం సముద్రంలో కొన్ని షాట్స్ చుపించారు. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ ను బట్టి సినిమాలో దేవర క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమవుతుంది. 

ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్ తో పాటూ ఎమోషన్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. అనిరుద్ బీజీయం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్  లో ఎలివేట్ చేసింది. ఇక చివర్లో ఎన్టీఆర్ షార్క్ తో చేసే ఫైట్ కు సంబంధించి కొన్ని షాట్స్ చూపించారు. అవైతే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మొత్తంగా దేవర రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.

#devara-trailer #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి