నడి సముద్రంలో 'దేవర' కటౌట్.. ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబైలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 14 Sep 2024 in సినిమా New Update షేర్ చేయండి Devara Movie : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇటీవల ముంబై వేదికగా ట్రైలర్‌ను రిలీ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. తారక్, కొరటాల శివ ఇప్పటికే బాలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక నార్త్ లోనూ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ముంబై నగరంలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. ఆయన అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనం దాదర్ చౌపత్తి బీచ్ వద్దే జరుగుతుంది. #Devara cutout is standing tall in the sea at Dadar Chowpatty in Mumbai ❤️#DevaraOnSep27th pic.twitter.com/fI0oKTlcap — NTR Arts (@NTRArtsOfficial) September 14, 2024 దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు. అదే బీచ్‌లో భారీగా దేవర పోస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది కాస్త సినిమా ప్రమోషన్స్ కు కలిసొస్తుందని ఫ్యాన్స్ ఈ ప్లాన్ చేశారు. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది. మాములుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇలా భారీ కటౌట్స్ తో హంగామా చేస్తుంటారు. అలాంటిది ఫస్ట్ టైం 'దేవర' తో నార్త్ లో ఎన్టీఆర్ కు ఇలాంటి అభిమానం దక్కడం విశేషం. కాగా ఈ సినిమా తర్వాత తారక్ డైరెక్ట్ గా 'వార్ 2' తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఒకవేళ 'దేవర' కు నార్త్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే.. 'వార్ 2' రిలీజ్ నాటికి అక్కడ ఎన్టీఆర్ కు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి