'దేవర' దెబ్బకు బద్ధలైన బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే!

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూల్ చేసినట్లు సమాచారం. 

derrrr
New Update

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్ సెప్టెంబర్ 27న విడుదలవగా బాక్సాఫీస్‌ భారీ విజయాన్ని అందుకుంది. తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు రూ.70 కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ సత్తా చాటుతోంది. 

ఇక ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా మెప్పించాడు. ఇక ‘దేవర’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే మీరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. కొరటాల శివ కూడా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

నైజాం-21.55 కోట్లు
సీడెడ్-10.12 కోట్లు
ఉత్తరాంధ్ర-6.04 కోట్లు
ఈస్ట్-4.40 కోట్లు
వెస్ట్-3.96 కోట్లు
గుంటూరు-6.75 కోట్లు
కృష్ణా-3.38 కోట్లు
నెల్లూరు-2.15 కోట్లు
ఏపీ + తెలంగాణ-(టోటల్)58.35 కోట్లు
కర్ణాటక-6.9 కోట్లు
తమిళనాడు-0.68 కోట్లు
కేరళ-0.09 కోట్లు
నార్త్-4.68 కోట్లు
ఓవర్సీస్-20 కోట్లు

#devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి