మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'దేవర' సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో డైరెక్టర్ కొరటాల శివ.. ఆడియన్స్ కోసం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పార్ట్-2 కోసం అలానే వదిలేసాడు. అందులో ఆడియన్స్ మదిలో ఎక్కువగా మెదులుతున్నవి ఏంటంటే.. అసలు యతి ఎవరు? మురుగ ఎలా చనిపోయాడు? సముద్రంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి? దేవరని అతను ఎందుకు చంపాడు? వర బతికే ఉంటాడా? ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి.
Also Read : ఆ శృంగార తార మీద ఒట్టు.. నీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకుంటా : RGV
పార్ట్-2 లో బాబీ డియోల్ ఎంట్రీ..
అయితే వీటన్నిటికీ సమాధానాలు దేవర 2 లోనే ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా 'దేవర' సినిమాలో భైరా(సైఫ్ అలీఖాన్) వద్ద పెరిగిన క్యారెక్టర్స్ లో అయిదుగురు ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు." దేవర సినిమాలో బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేశారు.
మాతో బాబీ డియోల్ సీన్ ఉంటుందని చెప్పారు. క్లైమాక్స్ లో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చి ఆ హైతో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తారేమో అనుకున్నాము. కానీ సినిమాలో చూస్తే అసలు బాబీ డియోల్ సీన్ లేదు. అలాగే సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి? దేవరని ఎవరు చంపారు? ఇవన్నీసెకండ్ పార్ట్ లోనే చూడాలి" అంటూ తెలిపారు. దీంతో వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.