Court Movie Collections: 'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ డే 8: ఊహించని కలెక్షన్స్‌!

నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' మూవీ మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లను సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 8 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం 42.3 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మూవీ టీమ్ తెలిపింది. చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ తో థియేటర్లలో అదరగొడుతోంది.

New Update
court collections

court collections

Court Movie Collections: దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్షన్లో ప్రియదర్శి, హర్ష రోహన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన "కోర్ట్" మూవీ థియేటర్లలో ఇంకా హవా కొనసాగిస్తోంది. రిలీజ్ రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్‌ అందుకున్న ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే మంచి ఓపెనింగ్స్ సాదించింది.

Also Read:'దొంగ ము** కొడుకు..' వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌..! ఫ్యాన్స్ ఫైర్!

8వ రోజు 2.7 కోట్ల గ్రాస్..

ఈ సినిమా విదుదలై 10 రోజులు అవుతుండగా  కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. వీక్ డేస్‌లో కూడా అద్భుతమైన వసూళ్లను నమోదు చేసింది. అయితే తాజా లెక్కల ప్రకారం, 8వ రోజు ఈ చిత్రానికి 2.7 కోట్ల గ్రాస్ వసూలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 8 రోజుల్లో ఈ చిత్రం 42.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 

Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!

అలాగే, యూఎస్ మార్కెట్‌లో కూడా 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి, 1 మిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ మార్కెట్‌ లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతూ సూపర్ హిట్ గా నిలిచింది. 'కోర్ట్' సినిమా లవ్ స్టోరీ, ఎమోషన్, భావోద్వేగాలతో ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే కాకుండా తక్కువ బడ్జెట్ మూవీస్ కి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ తో థియేటర్లలో అదరగొడుతోంది.

Also Read:Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
తాజా కథనాలు