/rtv/media/media_files/2025/06/02/Q5Nn7oWdB0Rt3zCfyiTP.jpg)
ali- rajendra prasad controversy
Comedian Ali: సీనియర్ నటుడు రాంజేంద్ర ప్రసాద్ తనను బూతు పదంతో సంబోధించడం పై కమిడియన్ అలీ స్పందించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. రాజేంద్రప్రసాద్ కావాలని అనలేదు.. సరదాగా మాట్లాడుతూ అనుకోకుండా అలా మాటతూలిందని తెలిపారు. కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. ప్లీజ్ ఇంతటితో ఆపేయండని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని సానుభూతుని వ్యక్తం చేశారు.
"ఆయన కావాలని అనలేదు.. అనుకోకుండా అలా.." రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్ #RajendraPrasad#Ali#ComedianAlipic.twitter.com/tBtXo3E0qa
— TeluguDesk (@telugudesk) June 2, 2025
అసలేం జరిగింది..
అయితే తాజాగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra prasad) కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పై ప్రసంగిస్తూ.. కమెడియన్ అలీపై (Comedian Ali) నోరు పారేసుకున్నారు. సరదాగా మాట్లాడుతున్న క్రమంలో కమెడియన్ అలీని ల***** అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఒక సీనియర్ నటుడు స్టేజ్ పై ఇలాంటి మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడు ఎక్కడ లం****కు..
— Whynot Cinemas (@whynotcinemass_) June 1, 2025
బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?
- #RajendraPrasadpic.twitter.com/yNwgUjFcpi
అది మీ సంస్కారం
ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. సరదాగా ఫ్లోలో అనేసిన మాటలను తప్పుగా తీసుకోవడం మీ సంస్కారం అని తెలిపారు. వాళ్ళు అనే ఉద్దేశంతో పొరపాటున అనేసిన మాటలను కొందరు తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను.. నేనేంటో అందరికీ తెలుసు అని అన్నారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!