'కలర్ ఫొటో' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్, చాందిని రావ్ మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు.
నేడు తిరుమలలో వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల, హీరో సుహాస్, వైవా హర్ష, పలువురు సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నెటిజన్లు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హీరో సుహాస్ ఈ పెళ్ళిలో ఫ్యామిలీతో సందడి చేశారు.
అంతేకాదు సందీప్ రాజ్ పెళ్లిని దగ్గరుండి మరీ జరిపించారు.