Gangavva : బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన

బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ గుండెపోటుకు గురైందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని 'మై విలేజ్ షో' సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా.. అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

gn
New Update

'మై విలేజ్ షో' తో యూట్యూబ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ ఇటీవల 'బిగ్ బాస్' సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హౌస్ లో ఆమె గుండెపోటుకు గురైందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ సైతం ఇది నిజమే అని అన్నారు. గంగవ్వకు గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారని, ఆమెకు వైద్యం అందించేందుకు వైద్యులు కూడా హౌస్ లోకి వచ్చారనే రూమర్స్ ఊపందుకున్నాయి. 

అసలు నిజం ఇదే..

దీంతో గంగవ్వ అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజా సమాచార ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదని తేలింది. గంగవ్వ గుండెపోటుకు గురయ్యారని వార్తల్లో ఎలాంటి నిజం లేదని 'మై విలేజ్ షో' సభ్యుల్లో ఒకరైన అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులతో ఫోన్ చేసి మాట్లాడగా.. అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

Also Read : అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

అంతేకాదు గంగవ్వకు గతంలోనూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఇక గంగవ్వ విషయానికొస్తే.. 'మై విలేజ్ షో'  అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ళ వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ, గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది.

అదే పాపులారిటీ తో  బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4లో నాలుగు వారాలు పాటు బాగానే సందడి చేసిన గంగవ్వ.. సీజన్ 4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్ళిపోయింది.. తాజాగా బిగ్ బాస్ ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన మొదటి రోజే అవ్వ.. అవినాష్ టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది. 

Also Read : ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నయనతార ఎమోషనల్ పోస్ట్

#gangavva #biggboss-season-8-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe