/rtv/media/media_files/2025/10/13/chiru-bobby-2025-10-13-13-29-59.jpg)
Chiru - Bobby
Chiru - Bobby: మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తో చేతులు కలిపారు. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ను KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం, రాశీ ఖన్నాను చిరు జోడిగా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవికి రాశీ ఖన్నా(Raashi Khanna) వయసులో చాలా తక్కువైనా, ఈ కాంబినేషన్ తెరపై ఎలా కనిపిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు, రాశీ ఎనర్జీ అన్నీ కలిసి ఒక ఫ్రెష్ పేర్‌గా కనిపిస్తోందని ట్రేడ్ టాక్.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
ఇక ఈ కాంబినేషన్‌ను అందంగా చూపించేందుకు సినిమా యూనిట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందట. ఇద్దరి లుక్‌లు, కెమిస్ట్రీ అన్నీ రియలిస్టిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
రెండో హీరోయిన్‌గా మలవికా మోహనన్..?
ఇక మలవికా మోహనన్(Malavika Mohanan) పేరూ రెండో హీరోయిన్‌గా పరిశీలనలో ఉంది. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు ఉండే అవకాశముంది. చిరంజీవికి బాబీ ఒక పవర్‌ఫుల్ పాత్రను రాసినట్టు సమాచారం.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి తమన్ సంగీతం అందించనున్నారు. సినిమా షూటింగ్ డిసెంబర్ 2025లో ప్రారంభమవనుంది. వచ్చే దసరాకి షూటింగ్ పూర్తిచేసి, 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయాలనే లక్ష్యంతో టీం పని చేస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ కంటే ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలని బాబీ, చిరు కాంబో గట్టి ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. రాశీ ఖన్నా - చిరు జోడీ తెరపై ఎలా కనపడతుందో, ప్రేక్షకుల స్పందన ఏంటో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఈ కొత్త కాంబోపై ఇప్పుడే హైప్ మొదలైంది!
Follow Us