సంక్రాంతి రేస్ నుంచి 'విశ్వంభర' అవుట్.. కారణం అదే

'విశ్వంభర' మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దాని స్థానంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజ‌ర్' వ‌చ్చి చేరింది. 'గేమ్ ఛేంజ‌ర్' మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు వెల్ల‌డించాడు. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.

vish
New Update

టాలీవుడ్ లో అందరి కంటే ముందు 2025 సంక్రాంతి బెర్ట్ కన్ఫర్మ్ చేసుకుంది 'విశ్వంభర' మూవీ. 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడే 2025 జనవరి 10 రిలీజ్ అని ప్రకటించేశారు. కట్ చేస్తే.. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అందుకు ఓ కారణం  కూడా ఉంది. 

'గేమ్ ఛేంజర్' వల్లే..

మెగాస్టార్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీనే. మ్యాటర్ ఏంటంటే.. సంక్రాంతికి 'విశ్వంభ‌ర' పోయి ఆ ప్లేస్‌లో రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' వ‌చ్చి చేరింది. తాజాగా ఈ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజు వెల్ల‌డించాడు. రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' సంక్రాంతికి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుండ‌టంతో 'విశ్వంభ‌ర' సినిమాను మే 09న విడుద‌లకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. 

దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లతో పాటూ మరో ఇద్దరు హీరోయిన్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా .. చంద్రబోస్ లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. 

#chiranjeevi #vishwambhara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe