మెగాస్టార్ చిరంజీవి నిన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ఏఎన్నాఆర్ జాతీయ అవార్డు 2024 అందుకున్న విషయం తెలిసిందే. అవార్డు ప్రదానం చేసిన వెంటనే అమితాబ్ బచ్చన్ దగ్గర చిరు ఆశీర్వాదం తీసుకున్నారు .ఇప్పటివరకూ తనకి ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఏఎన్ఆర్ అవార్డు రావడం తనకి చాలా ప్రత్యేకమని చిరంజీవి చెప్పారు. సాధారణంగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలుస్తారని.. కానీ నేను మాత్రం రచ్చ గెలిచి.. ఇప్పుడే ఇంట గెలిచానంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ తనకు లెజెండరీ సన్మానం చేస్తానని అడిగితే తాను వద్దన్నానని అప్పటి సంఘటన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ..' నాకు లెజెండరీ సన్మానం చేస్తా అన్నప్పుడు నేను వద్దన్నాను. ఎందుకంటే డా.డి.రామానాయుడు, డీవీఎస్ రాజు, బాపు, దాసరి ఇంత మంది పెద్దల్లో నేను చాలా చిన్నవాడిగా కనిపిస్తాను. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో సమానమైనవాడిని. నన్ను లెజెండ్‌ని చేసి వాళ్ల నుంచి దూరం చేయకండి..' అని చెప్పారు.
Also Read : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇదే వేడుకలో మోహన్ బాబు మాత్రం తనకు కూడా లెజెండరీ అవార్డు ఇవ్వాలని, తాను కూడా అర్హుడిని అన్నట్లి మాట్లాడారు. ఈ వజ్రోత్సవాల వేడుకలో మిమ్మల్ని సన్మానిస్తున్నాం అన్నారు. నేను వద్దన్నాను. అయితే వాళ్లు మీరు లెజెండ్ కాదు.. మిమ్మల్ని సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు. అసలు లెజెండ్ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ముందు మీరు దాని మీద ఓ పుస్తకం తీసుకురండి. సెలబ్రిటీని ఇలా గౌరవించాలి. లెజెండ్‌కు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పండంటూ తన గొప్పలు చెప్పుకున్నారు.
నెట్టింట ఫ్యాన్స్ రచ్చ..
అప్పుడెప్పుడో జరిగిన ఈ ఘటనను చిరు తాజాగా బయటికి తీయడంతో నెట్టింట దీనిపై ఫ్యాన్ వార్ జరుగుతోంది. మెగా vs మంచు ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.అయితే నెటిజన్స్ మాత్రం మెగాస్టార్ నే సపోర్ట్ చేస్తూ ఆనాడు చిరంజీవి అన్న మాటను నేడు నిలబెట్టుకున్నారని, ఆయన నిజంగా లెజెండరీ యాక్టర్ అని పొగుడుతున్నారు.
Also Read : 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ