/rtv/media/media_files/2024/12/04/jj5XkJlhK2MARyAmkG3Q.jpg)
chiranjeevi- Sreekanth odela
chiranjeevi- Sreekanth odela: గత కొన్ని రోజులుగా 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. నెత్తుటి చేతులతో మెగాస్టార్ తో కలిసి పిడికిలి బిగించిన ఫొటోను షేర్ చేశాడు. #చిరు శ్రీకాంత్ సినిమా.. హింసాత్మకంగా ఉండబోతుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క స్టిల్ తో సినిమా పై అంచనాలను పెంచేశాడు. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. 'దసరా' లాంటి మాస్ జాతరతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన శ్రీకాంత్.. మెగాస్టార్ తో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ప్రస్తుతం 'విశ్వంభర'
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నాడు. మల్లాడి వసిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లో 'విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్ర వీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది'.. వంటి అంచనాలను పెంచేశాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది.
Good morning.#ChiruOdelaCinema will be VEHEMENTLY VIOLENT.#FANBOYTHANDAVAM 🔥 pic.twitter.com/fKkqOBLmmm
— Srikanth Odela (@odela_srikanth) December 4, 2024
Unpredictable wild combination.❤️🔥 Wishing the entire team of #ChiruOdelaCinema all the best@KChiruTweets Garu @odela_srikanth @NameisNani @SLVCinemasOffl @UnanimousProd@sudhakarcheruk5 pic.twitter.com/AAH3821R89
— Ram Charan (@AlwaysRamCharan) December 4, 2024
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
Also Read: Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం?