Funky Review: ఫంకీ ఫస్ట్ డే రివ్యూ.. ఈసారైనా 'మాస్ కా దాస్' హిట్ కొట్టాడా..?

విశ్వక్ సేన్, కాయాదు లోహార్ హీరో హీరోయిన్ లుగా నటించిన అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న విడుదలైంది. కొన్ని వన్-లైనర్ జోకులు బాగున్నప్పటికీ, ఎక్కువ భాగం సిల్లీగా, కథ బలహీనంగా, ఎడిటింగ్, డబ్బింగ్ సమస్యలతో సినిమా అంతగా మెప్పించలేకపోయింది.

New Update
Funky Review

Funky Review

Funky Review: విశ్వక్ సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో నటించిన అనుదీప్ కేవీ దర్శకత్వంలోని ఫ్యామిలీ రోమాంటిక్ కామెడీ “ఫంకీ” ఫిబ్రవరి 13, 2026న Valentine’s Day వీకెండ్‌లో థియేటర్లలో విడుదలైంది. సినిమాలో కాయాదు లోహార్, నరేష్, VTV గణేష్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) తర్వాత, ప్రేక్షకులు సోషల్ మీడియాలో మొదటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కథ & కామెడీ

సినిమా అనుదీప్ స్టైల్ వన్-లైనర్ హాస్యంపై ఆధారపడి సాగుతుంది. కొన్ని జోకులు బాగానే వర్క్ అయినా, మిగతా భాగం ఎక్కువగా సిల్లీగా, అసహనంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగా లేని కారణంగా, సినిమాను చూస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కాంపైల్డ్ చేసిన కామెడీ క్లిప్స్‌లా అనిపిస్తుంది.

నటన

విశ్వక్ సేన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న యాక్టరు ఈ కామెడీ పాత్రకు సరిపో లేదు. అతను క్యారెక్టర్‌లో పూర్తిగా అర్ధం చేసుకుని నటించలేకపోయాడు. కథ రైటింగ్ రొటీన్, పాత ఫార్ములా ఆధారంగా ఉండటం, సినిమాకు కొత్తగా ఏమీ చేర్చలేదు.

మొత్తానికి కథ బలహీనంగా ఉంది, హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ మెప్పించలేదు. డబ్బింగ్ సమస్యలు, నాన్ సింక్ వాయిస్‌లు, సరిగ్గా లేని ఎడిటింగ్ సినిమాకు మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా, ఫంకీ ఒక సింపుల్ కామెడీతో కూడిన సినిమా. కొంత వరకు నవ్వులు తెప్పించిన జోకులు ఉన్నా, ఎక్కువ భాగం నిరాశ కలిగించింది.  సినిమా జాతి రత్నాలు తరహా హాస్యాన్ని గుర్తు చేస్తూనే, ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

Advertisment
తాజా కథనాలు