/rtv/media/media_files/2025/10/01/nayanatara-2025-10-01-12-29-36.jpg)
Nayanatara
Nayanatara: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వర ప్రసాద్ గారు (MSG)" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
#chiruanil#ManaShankaraVaraPrasadGaru#nayanatarapic.twitter.com/ycXYcnwLBc
— 𝓢𝓮𝓴𝓱𝓪𝓻 🍹 (@Sekhar_987) October 1, 2025
Also Read: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంచలనం.. హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్
విజయదశమి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం నయనతార పాత్రను "శశిరేఖ"గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. సాంప్రదాయ చీరకట్టులో నయనతార చూడముచ్చటగా కనిపిస్తోంది. ఆమె లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ పోస్టర్ ద్వారా ఆమె పాత్రలో ఎలెగెన్స్, గ్రేస్, క్లాస్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆమె పాత్ర చుట్టూ కథలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఫ్యాన్స్‌లో కలుగుతోంది.
Also Read: హైదరాబాద్‌లో దారుణం.. టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు
దసరా స్పెషల్ సర్‌ప్రైజ్
ఫస్ట్ లుక్ రిలీజ్‌తో పాటు, చిత్రబృందం మరో స్పెషల్ సర్‌ప్రైజ్‌ను కూడా దసరాకి రిలీజ్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ఇది చిరంజీవిగారి లుక్ అయి ఉండవచ్చు లేక సినిమాకు సంబంధించిన వీడియో అయి ఉండవచ్చు అని అభిమానులు ఊహిస్తున్నారు.
ఈ చిత్రంలో నయనతారతో పాటు కేథరిన్ థ్రెసా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. Shine Screens సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ ఈ చిత్రం కోసం మాస్ బీట్‌లతో మంచి ఆడియో అందించబోతున్నారని టాక్.
సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ఫిక్స్ చేసింది. మెగా ఫ్యాన్స్ కోసం ఇది పండుగకి స్పెషల్ గిఫ్ట్‌గా మారనుంది.