గిన్నిస్ రికార్డ్ సాధించిన చిరంజీవి.. డ్యాన్సుల్లో మెగాస్టార్ అరుదైన ఘనత మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూవ్స్ తో అలరించినందుకు మెగాస్టార్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరుకు ప్రదానం చేశారు. By Anil Kumar 22 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన ఖాతాలో మరో అవార్డ్ వచ్చి చేరింది. ఈసారి ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 156 సినిమాల్లో 537 పాటలు.. 24 వేల డేన్స్ మూవ్స్ తో అలరించినందుకు ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. 22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 537 songs , 24,000 dance moves in 156 films 🎬🎥📸. #GuinnessRecordForMEGASTARThe Dancing Sensation @KChiruTweets #GuinnessRecords #MegastarChiranjeevi pic.twitter.com/UzHFyfwRtj — BA Raju's Team (@baraju_SuperHit) September 22, 2024 తొలి నటుడిగా.. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా చిరంజీవి డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పడం విశేషం. Also Read : 'పుష్ప2' షూటింగ్ లో పెద్ద గొడవ జరిగింది.. జానీ మాస్టర్ బాగోతం బయటపెట్టిన హీరోయిన్ ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. 'బింబిసారా' మూవీ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోంది. చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. #chiranjeevi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి