'పుష్ప2' షూటింగ్ లో పెద్ద గొడవ జరిగింది.. జానీ మాస్టర్ బాగోతం బయటపెట్టిన హీరోయిన్

జానీ మాస్టర్‌ పై తెలుగు హీరోయిన్ మాధవీలత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని కొట్టాడు, పెళ్లి చేసుకో అంటూ ఆమెను టార్చ‌ర్ చేశాడని వీడియోలో పేర్కొంది.

New Update
madhavilatha

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం ఇండస్ట్రీని కుదిపేసింది. అతని దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు, అత్యాచారానికి పాలపడినట్లు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలు లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే  జానీ మాస్టర్‌ పై తెలుగు హీరోయిన్, బీజేపీ నాయ‌కురాలు మాధవీలత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.." జానీ అనే వాడికి కొంత‌మంది స‌పోర్ట్ చేస్తున్నారు. అందులో జ‌న‌సేన నాయ‌కుడు నటుడు నాగబాబు కూడా ఉన్నాడు. నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది. మీరు ఇలా మాట్లాడ‌టం స‌రికాదు.

 

Also Read : 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి మృణాల్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

షూటింగ్ లో పెద్ద గొడవ చేశాడు..

మీ అమ్మాయి కంటే చిన్న‌పిల్ల ఇంకా ఆ అమ్మాయి. జానీ అనే వాడు మీ వ‌ర‌కు మంచి వ్య‌క్తి కావ‌చ్చు కానీ ఆ అమ్మాయి విష‌యంకు వ‌చ్చేస‌రికి మంచి వ్య‌క్తి కాడు. సాక్ష్యంగా నేనున్నాను. పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌డికి జానీ వ‌చ్చి చాలా పెద్ద ర‌చ్చ చేశాడు. ఆ షూటింగ్‌లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు!. సుకుమార్ దానికి పంచాయితీ పెట్టి క్లియర్ చేశాడు. 

ఈ విష‌యం అల్లు అర్జున్‌కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి బ‌న్నీ అండ‌గా నిల‌బ‌డ్డాడు. రీసెంట్‌గా విశ్వ‌క్‌సేన్ మూవీలో కూడా అక్క‌డికి వ‌చ్చి ర‌చ్చ రచ్చ చేశాడు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆమెను టార్చ‌ర్ పెడుతున్నాడు. ఆ టార్చ‌ర్ భ‌రించలేకే అత‌డి నుంచి దూరంగా వ‌చ్చి సెపరేట్‌గా సినిమాలు చేసుకుంటుంది. ఎవ‌రు అయితే జానీకి స‌పోర్ట్ చేస్తున్నారో వాళ్లంద‌రూ త‌ప్పు చేస్తున్న‌ట్లే. ఇప్ప‌టికైనా మారండి" అంటూ వీడియోలో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ పై ఆమె చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు