Chikiri Chikiri Song: రికార్డుల సునామీ.. ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘చికిరి చికిరి’ సాంగ్‌కి భారీ వ్యూస్!

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చికిరి చికిరి’ అనే లిరికల్ సాంగ్ రిలీజై ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

New Update
Chikiri Chikiri Song

Chikiri Chikiri Song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చికిరి చికిరి’ అనే లిరికల్ సాంగ్ రిలీజై ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్న (శుక్రవారం) రిలీజైన చికిరి చికిరి సాంగ్.. కేవలం 24 గంటల్లోనే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా అదిరిపోయే రికార్డును నెలకొల్పొంది. 

Chikiri Chikiri Song

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. ఈ సాంగ్‌కు రామ్ చరణ్ డ్యాన్స్ ఇరక్కుమ్మేశాడు. అలాగే ఈ సాంగ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ సోయగాలు కుర్రకారును, అభిమానులను మంత్రముగ్దులను చేశాయి. ఈ పాట మెగా ఫ్యాన్స్‌కు ఒక విజువల్ ట్రీట్‌గా మార్చాయి.

దీంతో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్‌కి కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైం రికార్డు వ్యూస్ సాధించిన సాంగ్‌గా చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ సాంగ్‌కు సౌత్ ఇండియా వైడ్‌గా కేవలం 13 గంటల్లోనే అత్యధికంగా 32 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

ఈ సాంగ్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ‘పెద్ది’ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమా రేంజ్‌నే మార్చేశాయి. ఇప్పుడు ఈ సాంగ్‌తో బజ్ మరింత క్రియేట్ అయింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 27, 2026న ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisment
తాజా కథనాలు