Devara : 'దేవర' కు సెన్సార్ బోర్డ్ బిగ్ షాక్.. ఆ సీన్స్ తీసేయాలంటూ 'దేవర'టీమ్ కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. నాలుగు మార్పులు చేయాలని సూచించింది. ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. By Anil Kumar 13 Sep 2024 | నవీకరించబడింది పై 13 Sep 2024 16:58 IST in సినిమా New Update షేర్ చేయండి NTR Devara Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఈ చిత్రంలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్‌కు సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇందులో ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో సొరచేపను స్వారీ చేస్తున్న సీన్‌కు మేడ్ విత్ సీజీఐ అనే డిస్క్లైమర్ వేయాలని దేవర టీమ్‌కు తెలిపింది. ఈ సన్నివేశంలో ఎలాంటి జంతుహింస జరగలేదని టిక్కర్ వేయాలని వివరించింది. Also Read : 'దేవర' నన్ను బతికించు.. కన్నీరు పెట్టిస్తున్న అభిమాని వీడియోలు ఈ మార్పులతో దేవర మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. కాగా సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉండబోతోంది. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో తారక్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. Devar censor decision, spoilers about what they’ve trimmed & replaced pic.twitter.com/K7vmxYdttu — అర్జున్ 🪓 (@shehatearjun) September 12, 2024 ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, సైన్ తమ్ చాకో, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘జనతా గ్యారేజ్’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ ‘దేవర’ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి