Brahma Anandam: ఇక ఓటీటీలో నవ్వులే నవ్వులు.. వచ్చేసిన 'బ్రహ్మ ఆనందం’

కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'బ్రహ్మ ఆనందం' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ లో అధికారికంగా ప్రకటించారు.

New Update
Brahma Anandam

Brahma Anandam

Brahma Anandam:  డెబ్యూ డైరెక్టర్ RVS నిఖిల్ దర్శకత్వంలో లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు  రాజా గౌతమ్ కలిసి నటించిన కామెడీ ఎంటర్ టైనర్ 'బ్రహ్మ ఆనందం’. గతనెల ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. తాజాగా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. 

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

 'బ్రహ్మ ఆనందం’ ఓటీటీ రిలీజ్.. 

 'బ్రహ్మ ఆనందం’ ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ తాతామనవళ్ళుగా కనిపించి అలరించారు. వెన్నెలకిషోర్, ప్రియావడ్లమాని, ఐశ్వర్యహోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘుబాబు, ప్రభాకర్, దివిజప్రభాకర్, దయానందరెడ్డి  ఇందులో కీలక పాత్రలో పోషించారు. 

Also Read: Tamil Nadu: ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు