BIG BREAKING: నటి శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు!

నటి శిల్పా శెట్టి,  రాజ్‌ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. ముంబై కి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారనే అభిపయోగాలతో వీరిపై కేసు నమోదైంది. పెట్టుబడి పేరుతో రూ. 60 కోట్లు మోసం చేశారని దీపక్ కొఠారి జుహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

New Update
Shilpa Shetty

Shilpa Shetty

BIG BREAKING:  బాలీవుడ్ నటి శిల్పా శెట్టి  మరోసారి వార్తల్లో నిలిచారు. శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలపై చీటింగ్  ఆరోపణలతో  కేసు నమోదైంది. ముంబై కి చెందిన వ్యాపార వేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు జుహు  పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. 

శిల్పా శెట్టి దంపతులు  పెట్టుబడి పేరుతో తన నుంచి రూ. 60 కోట్ల డబ్బు తీసుకొని.. దానిని స్వంత వినియోగాల కోసం వాడుకున్నారని, తనను మోసం చేశారని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొఠారి ఫిర్యాదు మేరకు మోసపోయిన డబ్బు రూ. 10 కోట్లకు పైగా ఉండడంతో ఈ కేసును  ఆర్థిక నేరాల విభాగానికి (EOW)  ట్రాన్స్ఫర్ చేశారు జుహు పోలీసులు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. 

ఆరోపణలు ఏమిటంటే..

అయితే  2015లో దీపక్ కొఠారి అనే వ్యక్తి  శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాలకు  ఒక ఏజెంట్ ద్వారా పరిచయమయ్యాడు. అప్పుడు శిల్పాశెట్టి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్ 'బెస్ట్ డీల్ టీవీ'  సంస్థకు  డైరెక్టర్‌గా, 87% షేర్ హోల్డర్‌గా ఉన్నారు. కాగా, ఈ  వ్యాపారాన్ని విస్తరించడానికి వారికి రూ. 75 కోట్ల లోన్ కావాల్సి వచ్చిందట.  ఆ సమయంలో దీపక్ .. శిల్పా శెట్టి దంపతులకు రూ. 60 కోట్లు పెట్టుబడిగా ఇవ్వగా.. ఇప్పుడు ఆ విషయంలోనే వారు తనను మోసం చేసినట్లు కేసు పెట్టాడు. 

మూడు విడతలుగా 

అయితే కొఠారి ఆ రూ. 60 కోట్లు డబ్బును మూడు విడతలుగా ఇచ్చినట్లు తెలిపాడు.  2015 ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ. 31.95 కోట్లు, ఆ తర్వాత 2015 జూలై నుంచి 2016 మార్చి మధ్యలో రూ. 28.54 కోట్లు బదిలీ చేసినట్లు  తెలిపాడు. మొత్తం మీద, శిల్పా శెట్టి దంపతులకు  రూ. 60.48 కోట్లు ఇచ్చాననిని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది మాత్రమే కాకుండా  స్టాంప్ డ్యూటీ కోసం అదనంగా రూ. 3.19 లక్షలు కూడా చెల్లించినట్లు చెప్పాడు.  ఈ డబ్బుకు సంబంధించి  2016 ఏప్రిల్‌లో శిల్పాశెట్టి  తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని పేర్కొన్నాడు. స్వయంగా తన డబ్బుకు గ్యారెంటీ ఇచ్చినట్లు  కొఠారి పేర్కొన్నారు. 

కానీ కొన్ని నెలల తర్వాత, 2016 సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని,  ఆ తర్వాత  కంపెనీ దివాలా తీసిందని, ఈ విషయాలేవీ బయటకు చెప్పకుండా ఉంచారని వివరించాడు.  అప్పటినుంచి  తన డబ్బును తిరిగి ఇవ్వమని పదేపదే అడిగినా, ఆ డబ్బు తిరిగి రాలేదని.. తనకు  తెలియకుండానే కంపెనీపై రూ. 1.28 కోట్ల దివాలా కేసు కూడా నమోదైందని ఫిర్యాదులో తెలిపాడు. పెట్టుబడి కోసం ఇచ్చిన తన డబ్బులను వ్యక్తిగత ఖర్చులకు వాడుకొని తనను  మోసం చేశారని ఆరోపించాడు. 

Also Read: 50 Years Of Rajinikanth: సినీ తారల నుంచి సీఎం వరకు.. సూపర్ స్టార్ కి సూపర్ విషెస్!

Advertisment
తాజా కథనాలు