BIG BREAKING : సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠ ధామ్‌లో ఆమె అంత్యక్రియలు తాజాగా పూర్తయ్యాయి.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు (అక్టోబర్ 4, 2025) 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠ ధామ్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఆమె మరణానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ.. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్తతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Sandhya Shantaram Death

వి.శాంతారామ్ భార్యగా.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆమె ప్రాణం పోశారు. 1950ల కాలంలో బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె నటనకు గానూ ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ముఖ్యంగా ఝనక్ ఝనక్ పాయల్ బాజే, దో ఆంఖే బారా హాత్, నవరంగ్ వంటి సినిమాలలో ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మరీ ముఖ్యంగా ఆమె నటించిన ‘నవరంగ్’ చిత్రంలోని ‘‘అరే జా రే హత్ నట్ఖత్’’ అనే సాంగ్‌ బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. 

ఈ సాంగ్‌లో ఆమె ప్రదర్శించిన అద్భుతమైన డ్యాన్స్, హావభావాలు ఇప్పటికీ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. కేవలం నటిగానే కాకుండా.. ఆమె చేసిన ప్రదర్శనలు సాంప్రదాయ, ఆధునిక సినిమా మధ్య వారధిగా నిలిచాయి. ఆశా భోంస్లే ఆలపించిన ఈ పాటలో సంధ్య శాంతారామ్ పలికించిన చురుకైన హావభావాలకు, డ్యాన్స్‌కు అప్పట్లో విశేష ప్రశంసలు దక్కాయి. చులబులైన పదాలతో కూడిన ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా హోలీ పండుగ సందర్భంగా ఈ పాట ప్రతిచోటా మార్మోగుతూ, ప్రజలను ఉల్లాసంగా డ్యాన్స్ చేసేలా చేస్తుంది. 

సంధ్య శాంతారామ్ సినీ జీవితంలో ‘‘అరే జా రే హత్ నట్ఖత్’’ సాంగ్ చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఈ సాంగ్‌లో సంధ్య చేసిన డ్యాన్స్‌కు ఆమె భర్త, దర్శకులు వి. శాంతారామ్ ఫిదా అయిపోయినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె ఈ పాటకు స్వయంగా కొరియోగ్రఫీ చేయడం విశేషమనే చెప్పాలి. భారతీయ సినిమాకు ఆమె అందించిన విశేష సేవలను సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Advertisment
తాజా కథనాలు