/rtv/media/media_files/2025/03/23/FzPB6dGs7gsGsrQJKZk1.jpg)
Prabhas Spirit Update
Prabhas Spirit Updates: టాలీవుడ్ హీరోలందరిది ఒక లెక్క అయితే ప్రభాస్ ది ఇంకో లెక్క. బాహుబలితో ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎవరూ టచ్ చేయలేని రేంజ్ కి ఎదిగాడు ప్రభాస్. అయితే సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు ప్రభాస్. మారుతీ డైరెక్షన్లో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్లో 'ఫౌజీ' అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో "స్పిరిట్" అనే మూవీని కూడా పట్టాలెక్కించబోతున్నాడు.
Also Read: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!
'యానిమల్' బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్ ఆకాశానికి పెరిగింది. దీంతో, స్పిరిట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు 'స్పిరిట్' పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్‌కు అన్నయ్యగా ముఖ్య పాత్రలో నటించనున్నారాని తెలుస్తోంది.
Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..
ప్రభాస్‌కి అన్నగా సంజయ్ దత్త్..!
ప్రభాస్ ఈ చిత్రంలో ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో , స్పిరిట్ సినిమాను సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించనున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ కావడంతోనే ఇందులో సంజయ్ దత్త్ ని ప్రభాస్ కి అన్నయ్యగా తీసుకున్నారని సమాచారం.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
అంతే కాదు ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కూడా కనిపించబోతున్నాడని టాక్. ప్రభాస్ పాత్ర హై ఓల్టేజ్ యాక్షన్‌తో, చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మరి "స్పిరిట్" సినిమాలో సంజయ్ దత్ పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి మరికొన్ని వెయిట్ చేయక తప్పదు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం స్పిరిట్ మూవీ కోసం భయంకరంగా ఎదురు చూస్తున్నారు.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!