Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదం .. చేతిలో పేలిన గన్!

బాలీవుడ్ నటుడు గోవిందాకు ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఇంట్లో గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. బుల్లెట్ వెళ్లి ఆయన ఎడమ కాలికి తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబై క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update

Actor Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా పెను ప్రమాదం తప్పింది.  ఇంట్లో తన సొంత లైసెన్స్‌డ్  గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. బులెట్ శబ్దం వినిపించడంతో ఇంటి సభ్యులు ఆయన గదిలోకి వెళ్లి చూడగా.. గన్ నుంచి పేలిన బుల్లెట్ ఆయన  ఎడమ కాలికి తగిలింది. దీంతో వెంటనే గోవిందాను ముంబై లోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కాలి నుంచి బులెట్ తొలగించగా.. ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం గోవిందా ఇంకా స్పృహలోకి రానట్లుగా తెలుస్తోంది. 

Also Read :  అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్‌ జెట్‌!

#bollywood #gun-shot #govinda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe