హనీ రోజ్ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్

సినీ నటి  హనీ రోజ్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిజినెస్‌మెన్ బాబీ చెమ్మన్నూర్‌కు కేరళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

New Update
Boby Chemmannur granted bail in the sexual harrasment case

Boby Chemmannur granted bail in the sexual harrasment case Photograph: (Boby Chemmannur granted bail in the sexual harrasment case)

సినీ నటి  హనీ రోజ్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిజినెస్‌మెన్ బాబీ చెమ్మన్నూర్‌కు కేరళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అరెస్టైన బాబీ చెమ్మనూర్ ప్రస్తుతం కాకనాడ్ జైలులో ఉన్నారు.

ప్రస్తుతం  బెయిల్ మంజూరు కావడంతో ఈరోజే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చెమ్మన్నూర్‌ను ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు బుధవారం వాయనాడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకుళం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తనపై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో బాబీ చెమ్మనూర్‌ బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

 

ప్రతీకారభావంతో ఇబ్బంది

కాగా  ఇటీవల వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్‌ తనను ఇబ్బంది పెడుతున్నట్లు హనీ రోజ్ నటి వెల్లడించారు.' ఒక వ్యక్తి కావాలనే నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించగా, వ్యక్తిగత కారణాల వల్ల వాటికి హాజరుకాలేకపోయాను. ఆ కారణంగా, ప్రతీకారభావంతో నేను హాజరయ్యే ప్రతి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ, నన్ను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు..' దీనిపైనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.

కాగా పలు మలయాళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలో బాలయ్య భార్యగా నటించి మెప్పించారు. 2023 లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Aslo Read :  Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు