Lawrence Bishnoi Gang: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య (Baba Siddique Murder) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే సిద్దిఖీని హత్య చేసింది తామేనని బిష్ణోయి గ్యాంగ్ ప్రకటించుకుంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి బిష్ణోయి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే తరచుగా హై-ప్రొఫైల్ కేసుల్లో లారెన్స్ బిష్ణోయి పేరు వినిపిస్తున్నప్పటికీ.. అతడిని కస్టడీలోకి తీసుకోవడంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సవాల్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
Also Read : యాంకర్ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఉన్నారు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటిపై కాల్పులు జరిపిన కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. ముంబై పోలీసులు బిష్ణోయ్ కస్టడీ కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.
Also Read: బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే!
2023లో ఢిల్లీ తిహార్ జైలు నుంచి బిష్ణోయ్‌ని సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌పై ఇప్పటికే డిజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. 2022లో పంజాబీ ఫేమస్ సింగర్ సిద్దూ మూసేవాలాను అత్యంత దారుణంగా కాల్చి చంపింది ఈ ముఠా.
దావూద్ ఇబ్రహీం తరహాలో బిష్ణోయి గ్యాంగ్
ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉండడంతో ఈ ముఠాలోని ముగ్గురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. వారిలో ఒకరు బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, గోల్డిబ్రార్, మరొకరు రోహిత్ గోదర్. ప్రస్తుతం ఈ ముగ్గురు విదేశాల్లో ఉన్నారు. 1990లో దావూద్ ఇబ్రహీం చిన్న చిన్న నేరాలతో ప్రారంభించి తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో అదే తరహాలో బిష్ణోయ్ గ్యాంగ్ విస్తరించిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
Also Read : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!
సల్మాన్ ఖాన్‌ను చంపడానికి అసలు కారణం
బిష్ణోయ్ సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను (Blackbuck) వేటాడి చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది బిష్ణోయి గ్యాంగ్. దీని కారణంగానే ఆ గ్యాంగ్ సల్మాన్‌ను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ముంబైలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు.
Also Read: తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తాజాగా బాబా సిద్దిఖి హత్య వెనుక కూడా ఇదే కారణం ఉందని అనుమానిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంవల్లే సిద్దిఖీని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్‌కు సపోర్ట్ చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని బిష్ణోయ్ గ్యాంగ్ ఓ సోషల్‌మీడియా పోస్టు పెట్టింది.