/rtv/media/media_files/2025/12/05/payal-rajput-2025-12-05-20-05-27.jpg)
Payal Rajput
Payal Rajput: ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో తనదైన స్థానం సంపాదించిన నటి పాయల్ రాజ్‌పుత్, ఇప్పుడు పూర్తిగా వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచేందుకు సిద్ధమవుతోంది. ఆమె నటిస్తున్న తాజా సినిమా “వెంకటలచ్చిమి” నుంచి వచ్చిన బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పాయల్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ముని ఈ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. షాక్ కలిగించేలా ఉన్న ఈ పోస్టర్‌లో పాయల్ రాజ్‌పుత్ తలకిందులుగా వేలాడుతూ, చేతులకు గొలుసులు కట్టబడి, జైలు లాంటి గదిలో ఉన్నట్టు కనిపిస్తుంది. నేలపై రక్తపు మరకలతో పాటు మొఖం మీద మంగళసూత్రం పడివుండటం పోస్టర్ లో చూపించారు.
Also Read: జపాన్ ఈవెంట్ లో అదరకొట్టిన ప్రభాస్.. 'స్పిరిట్' లుక్ ఇదేనా..?
ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమా ఎంత గంభీరంగా, ఎంత భావోద్వేగంతో నిండివుంటుందో స్పష్టంగా తెలుస్తోంది. ఇది సాధారణ కథ కాదని, ఒక తీవ్రమైన ప్రతీకారం ఉన్న డ్రామా అని మేకర్స్ చెప్పకుండానే అర్థమవుతోంది. “ఫస్ట్ లుక్ & గ్లింప్స్ త్వరలో వస్తాయి” అంటూ టీమ్ మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని తెలిపింది. దర్శకుడు ముని మాట్లాడుతూ, ‘వెంకటలచ్చిమి’ కథ ఒక ఆదివాసి మహిళ నిజ జీవిత ప్రతీకార కథ నుంచి ప్రేరణ పొందిందని చెప్పారు. సినిమాలో ఆమె ఎదుర్కొన్న బాధలు, అన్యాయం, తిరిగి నిలబడే ధైర్యం అన్నిటిని చాలా రియలిస్టిక్ గా చూపించబోతున్నారని తెలిపారు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'అఖండ 2' విడుదలపై క్లారిటీ..?
పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, కథ తన మనసును తాకిందని, ఈ రోల్ ఎంతో బలంగా, మార్పు తెచ్చే విధంగా ఉందని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు తనను “వెంకటలచ్చిమి” అనే పేరుతోనే పిలిచినా ఆశ్చర్యం లేదని వెల్లడించారు.
పాన్- ఇండియా స్థాయిలో భారీ రిలీజ్
రాజా, పవన్ బండ్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్- ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ మొత్తం ఆరు భాషల్లో విడుదల అవుతుంది. ఎమోషన్స్, రా ప్రెజెంటేషన్, యాక్షన్‌తో కూడిన ప్రతీకారం కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘వెంకటలచ్చిమి’ ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతుందని టీమ్ నమ్ముతోంది.
Follow Us