/rtv/media/media_files/2025/12/05/akhanda-2-release-2025-12-05-17-13-54.jpg)
Akhanda 2 Release
Akhanda 2 Release: పాన్- ఇండియన్ స్థాయిలో భారీ అంచనాలు ఉన్న 'అఖండ 2' విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎరోస్ ఇంటర్నేషనల్‌కి సంబంధించిన ఆర్థిక సమస్యలు, పాత బకాయిల వివాదం ఒక్కసారిగా బయటకు రావడంతో సినిమా విడుదల అనూహ్యంగా నిలిచిపోయింది. ఈ ఘటన అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, సినిమా టీమ్ రాత్రంతా కష్టపడి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడంతో, ఇప్పుడు పరిస్థితి క్రమంగా సానుకూలంగా మారుతున్నట్లు సమాచారం.
చర్చలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే సానుకూలంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది.. కొన్ని ప్రధాన ఆటంకాలు తొలగిపోయినట్లుగా తెలుస్తోంది. 'అఖండ 2' విడుదలకు అడ్డంకి అయ్యే అంశాలు ఎక్కువగా క్లియర్ అయినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ భాగం ఒప్పందాలు పూర్తయ్యాయి, ఇంకా ఒకే పార్టీ మాత్రమే ఒప్పుకోవాల్సి ఉంది. వారితో కూడా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు సక్సెస్ అయితే అఖండ 2 విడుదలకు పూర్తిగా లైన్ క్లియర్ అవుతోందని తెలుస్తోంది..
సినిమా టీమ్, ముఖ్యంగా నిర్మాతలు, ఇరువైపులా మాట్లాడి సమస్యను త్వరగా ముగించాలని కృషి చేస్తున్నారు. ఎరోస్ తో ఉన్న సమస్య వల్లే సినిమా ఆగిపోయినందున, ఎలా అయినా ఈ రోజు లోపే క్లియరెన్స్ తీసుకోవాలని చూస్తున్నారు.
రాత్రి నుంచి ఉదయం వరకు సినిమా విడుదల పరిస్థితి పూర్తిగా సందిగ్ధంగా మారిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సానుకూల సమాచారంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు పెరిగాయి. సెటిల్మెంట్ పూర్తయితే, ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా. దాంతో పాటు, రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారట. బాలయ్య అభిమానులు ఈ వార్తలు విన్న వెంటనే సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చిన సమస్యలు తొలగిపోతే, అఖండ 2 థియేటర్లలో గర్జించే రోజు దూరంలో లేదని ఆనందపడుతున్నారు.
సినిమా టీమ్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన, ఇప్పుడిప్పుడే చర్చలు సానుకూలంగా సాగుతున్నందున, సినిమా టీమ్ కూడా అధికారిక ప్రకటన ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే విడుదల సమయాన్ని ప్రకటిస్తారని సమాచారం. ఈ సమస్య వల్ల సినిమా ఆలస్యమైనా, అఖండ 2పై అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, 3D ఫార్మాట్ అన్ని కలిపి అఖండ 2ని ఈ వారం అత్యంత ఆసక్తికరమైన సినిమాగా మార్చాయి.
మొత్తం మీద, ఇప్పటివరకు అఖండ 2ని ఆపిన ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కార దిశగా సాగుతున్నాయి. మరొక పార్టీ ఒప్పుకున్న వెంటనే సినిమా విడుదలకు మొత్తం మార్గం సాఫీ అవుతుంది. ప్రస్తుతం పరిస్థితి మొత్తం పాజిటివ్‌గా ఉండటంతో, అఖండ 2 త్వరలోనే థియేటర్లలోకి రావడం ఖాయం అని చెప్పవచ్చు. అభిమానులు ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us