Ramya Moksha Eliminate: పచ్చళ్లపాప రమ్యకు బిగ్ షాక్.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకెళ్లారు. అయితే అందరూ ఊహించినట్లుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పచ్చళ్లపాప రమ్య మోక్ష ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చింది.

New Update
Bigg Boss Telugu 9 Ramya Moksha Eliminate

Bigg Boss Telugu 9 Ramya Moksha Eliminate

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకెళ్లారు. అయితే అందరూ ఊహించినట్లుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పచ్చళ్లపాప రమ్య మోక్ష ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఆమెకు అతి తక్కువ ఓట్లు రావడంతో రమ్య మోక్ష బిగ్ బాస్ ప్రయాణ కేవలం రెండు వారాలకే పరిమితమైంది.  

Ramya Moksha Eliminate

ఇకపోతే రమ్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే తన దూకుడు మొదలెట్టింది. అనవసరమైన వాదన, ఆవేశపూరితమైన మాటలతో మొదట హౌస్ లో అట్రాక్టివ్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ వంటి కంటెస్టెంట్లపై ఆమె మాట్లాడిన మాటలు, నామినేషన్ ప్రక్రియలో చూపిన అగ్రెసివ్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. 

దీంతో ఈ ఏడో వారం నామినేషన్లలో మొత్తం 8 మంది కంటెస్టెంట్లలో.. రమ్య మోక్షతో పాటు తనూజ, రాము రాథోడ్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్, సంజన, దివ్య నిఖిత, రీతూ చౌదరి ఉన్నారు. వీరిలో ఈ వారమంతా రమ్య చూపిన ప్రవర్తనపై ఆడియన్స్ విపరీతమైన వ్యతిరేకతను చూపించారు. ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ లోనే కాకుండా ట్రెండ్స్ లోనూ రమ్యకు అతి తక్కువ ఓట్లు పడ్డాయి. 

దీంతో ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఖాయం కాగా.. చివరికి రమ్య ఇంటి నుంచి బయటకెళ్లడం ఖాయమైంది. ఈ రెండు వారాలకు గానూ రమ్యకు మంచి రెమ్యూనరేషన్ లభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎలిమినేషన్ కు ప్రధాన కారణాలు ఉన్నాయని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో రమ్య తన గేమ్ కంటే గొడవలు, వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు