Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే.. నాగబాబు సంచలన పోస్టు

బుల్లితెర నటుడు భరణి శంకర్ 'బిగ్ బాస్ తెలుగు 9' హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాబ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు భరణి అత్యంత సన్నిహితుడని, ఆయన బిగ్ బాస్ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

New Update
nagababu wishes serial actor bharani shankar

nagababu wishes serial actor bharani shankar

బిగ్ బాస్ సీజన్ 9 అట్టహాసంగా నిన్న (ఆదివారం) ప్రారంభమైంది. ఊహించని మార్పులు, ఊహకందని మలుపులతో ఈ సారి రియాల్టీ షో ఓ రేంజ్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని హోస్ట్ నాగార్జున్ హామీ ఇచ్చారు. ఇక Bigg Boss 9 హౌస్‌లోకి ఈ సారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు.

Bigg Boss 9 Telugu

వారిలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ కింద.. తనూజ, ఆశాషైనీ, సంజనా గల్రానీ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రేష్ఠ వర్మ, భరణి శంకర్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన.. మాస్క్ మెన్ హరీష్, సోల్జర్ పవన్ కల్యాణ్, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్, ప్రియా శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రెటీలు కాగా.. మరో 6గురు సామాన్యుల్ని ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపిక చేశారు. ఇలా ఈ 15 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు 15 వారాలు బీభత్సం సృష్టించబోతున్నారు. 

ఇందులో టీవీ సీరియల్ నటుడు భరణి శంకర్ గురించి అందరికీ తెలిసిందే. చిలసౌ స్రవంతి, కుంకుమ రేఖ, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్‌తో ఆయన ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా దాదాపు 30కి పైగా సీరియల్స్‌లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకుల్ని అలరించారు.

ఇప్పుడు ఆయన ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి భరణి శంకర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అతడు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కావడంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి అలా అడుగుపెట్టిన సందర్భంగా మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. 

‘‘నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా అర్హమైన విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి!’’ అని తాను కోరుకుంటున్నట్లు తన ఇన్‌గ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు.

ఈ పోస్టుపై నటుడు భరణి శంకర్ స్పందిస్తూ.. ‘‘ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ నాగబాబు సర్’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో వీరి పోస్టు వైరల్‌గా మారింది. జనసైనికులు కామెంట్ల మీద కామెంట్లు కురిపిస్తున్నారు. చాలా మంది భరణి శంకర్‌కు ఆల్ ది బెస్ట్ విషెస్‌లు చెబుతున్నారు.  మరికొందరు మాత్రం నాగబాబు పోస్టుపై సెటైర్లు వేస్తున్నారు. నాగబాబు సపోర్ట్ చేయడం ద్వారా జనసైనికులు ఓట్లు వేయడంలో బిజీ బిజీ అవుతారని కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు