/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-divvela-madhuri-2025-10-25-18-17-15.jpg)
Bigg Boss Telugu 9 Divvela Madhuri
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా 48వ రోజుకు సంబంధించిన 2వ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో పచ్చళ్ల పాప రమ్య ఎలిమినేట్ అయినట్లు చూపించారు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలాంటివారో చెప్పమని రమ్యని అడగ్గా.. ఆమె పలువురి కంటెస్టెంట్లపై కొన్ని పాయింట్లు పెట్టి వారు ఎలాంటి వారో తెలిపింది.
Bigg Boss Telugu 9 Day 48 Promo 2
ఆ తర్వాత కంటెస్టెంట్లందరూ వరుసగా తమ పాయింట్లతో ఇతర కంటెస్టెంట్ల గురించి చెప్పారు. అదే క్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురికి హోస్ట్ నాగార్జున మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె రితూపై చేసిన వ్యాఖ్యలకు గానూ ''నువ్వు తోపు అయితే.. బయట చూసుకో గాని హౌస్ లో కాదు'' అంటూ గట్టిగానే సమాధానం చెప్పారు. ఆయన అలా అనడానికి ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఇన్సిడెంటే కారణం.
ప్రోమో ప్రకారం.. అందరూ కంటెస్టెంట్లు ఒక దగ్గర కూర్చున్న తర్వాత ఎలిమినేట్ అయిన రమ్యకు హోస్ట్ నాగార్జున కొన్ని పదాలు చూపించారు. అందులో ఒక పదాన్ని తీసుకుని అది హౌస్ లో ఎవరికి చెందుతుందో వారి మెడలో వేయమన్నారు. ఆమె 'ఫేక్ బాస్' అనే పదాన్ని తీసుకొచ్చి దివ్వెల మాధురి మెడలో వేసి దానికి గల కారణాన్ని తెలిపింది.
ఆ తర్వాత డెమోన్ పవన్ 'ఇమ్మెచ్చ్యుర్' అనే పదాన్ని కళ్యాణ్ మెడలో వేసి తగిన కారణాన్ని తెలిపాడు. అనంతరం పలువురు కంటెస్టెంట్లు మిగత వారిపై తగిన కారణాలు చెప్పారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మాధురి చేసిన వ్యాఖ్యలను రీతు గుర్తు చేసింది. 'నీ బిహేవియర్ బాగోదు. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను అని మాధురి చాలా మాటలు అనేసింది' అంటూ రీతూ తెలిపింది.
దీనిపై స్పందించిన మాధురి.. అలా అనడానికి గల కారణాన్ని తెలిపింది. అనంతరం తాను బిగ్ బాస్ హౌస్ లో రీతూని కొడతానని అనలేదని.. ఇలాంటి పనులు బయట చేసుంటే.. జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేదాన్నని తెలిపింది. మాధురి వ్యాఖ్యలపై నాగార్జున సీరియస్ అయ్యారు. ''మాధురి ఆఖరిసారి చెప్తున్నాను. నేలకేసి కొడతాను, తోక్కుతా, తాటతీస్తా అంటే బాగోదు. బయట మీరు తోపైతే బయట చూస్కోండి. అంతేకాని బిగ్ బాస్ హౌస్ లో కాదు.'' అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Follow Us