/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-day-48-promo-1-nagarjuna-star-maa-2025-10-25-16-54-07.jpg)
Bigg Boss Telugu 9 Day 48 Promo 1 Nagarjuna Star Maa
Bigg Boss Telugu 9 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. 48వ రోజు కోసం విడుదలైన మొదటి ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 'రణరంగమే' అంటూ ప్రచారం చేసుకున్న బిగ్ బాస్ 48వ రోజు ప్రోమోతో అసలు మజా చూపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగుపెట్టి రచ్చ రచ్చ చేస్తున్న ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి, పచ్చళ్ల పాప రమ్య మోక్ష మధ్య మాటల యుద్ధం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
Bigg Boss Telugu 9 Day 48 Promo 1
ఈ ఇద్దరు హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ల మధ్య జరిగిన మాటల యుద్ధం.. ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్రోమో విషయానికొస్తే..
ప్రోమో మొదట్లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. చిన్న చిన్న పదాలతో కూడా ఆర్గ్యూమెంట్ చేసుకోవడం, అరవటం మన బిగ్ బాస్ హౌస్ లోనే జరుగుతుంది. వెల్దాం, సెట్ చేద్దాం అంటూ.. హౌస్ లోపల జరిగిన మాటల యుద్ధాన్ని చూపించారు. అందులో మొదట మాధురి మాట్లాడుతూ.. సాయి అన్నీ ఎదురుగా చెప్పడేమో, పక్కకెళ్లి చెప్తాడేమో అని అనగానే సాయి వాయిస్ లేచింది. నేనెందుకు చెప్తా అంటూ మాట్లాడాడు. ఇలా ఇద్దరి మధ్య మొదట మాటల యుద్ధం చెలరేగింది.
ఎదైనా ఉంటే ఎదురుగా మాట్లాడు.. లేదంటే లేదు. అంతేకాని నా గురించి పక్క వాళ్లతో చెప్పడం సరికాదు అంటూ సాయికి మాధురి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. హేయ్ అరుస్తావేంటి, నీకు మైండ్ ఉందా?, నీతో మాట్లాడాల్సిన అవసరం ఎవరికుంది?, నోరు అదుపులో పెట్టుకో అంటూ మాధురి చెలరేగిపోయింది.
ఇక అప్పుడే రమ్య ఎంట్రీ ఇవ్వడంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. హేయ్ నువ్ ఇటు రా అంటూ రమ్యపై కూడా మాధురి నిప్పులు గక్కింది. దీంతో మాధురి, రమ్య మధ్య మాటల వార్ చిలికి చిలికి మరింత పెద్దదిగా మారింది. ఈ ప్రోమో నిజంగానే ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.
Follow Us