Bigg Boss 9 Telugu: ఇట్స్ అఫీషియల్.. ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 9 అప్‌డేట్‌.. వీడియో అదిరింది మచ్చా

‘బిగ్ బాస్ సీజన్ 9’ కి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. ‘‘ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే’’ అంటూ అఫీషియల్‌గా ఓ పవర్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్లు వీడియో ద్వారా అర్థం అయింది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.

New Update

bigg boss


‘బిగ్ బాస్’.. ఈ రియాల్టీ షోకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగులో ఈ షోకు ఊరమాస్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు 8 సీజన్లు అత్యంత గ్రాండ్‌గా ముగిసాయి. మొదటి సీజన్ నుంచి 8వ సీజన్ వరకు బిగ్ బాస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు సీజన్లను నాని, ఎన్టీఆర్ నడిపించగా.. మిగతా సీజన్లను నాగార్జున్ తన భుజంపై మోసి దిగ్విజయంగా పూర్తి చేశారు. 

అయితే గత సీజన్ అంటే 8వ సీజన్‌కు పెద్దగా ఆదరణ లభించలేదనే టాక్ కూడా వినిపించింది. అందువల్ల తరువాత రాబోయే సీజన్ 9కు అలాంటి పొరపాట్లు జరగకూడదనే పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సారి మరింత క్రేజీ, టాక్ ఆఫ్ ది టౌన్‌ గా మారిన వారిని కంటెస్టెంట్లుగా తీసుకోబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ 9 తెలుగు మరింత కాంట్రవర్సీ, డ్రామా, ఎంటర్‌ట్రైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్‌’ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఇప్పటి వరకు 8 సీజన్స్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు 9వ సీజన్ ప్రారంభం అవుతుందా? అందులోని కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారా? అనే దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

bigg boss 9 telugu

ఇందులో భాగంగా తాజాగా సీజన్‌ 9 అప్‌డేట్‌ వచ్చేసింది. ‘‘ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే’’ అంటూ ఓ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్లు వీడియో ద్వారా అర్థం అయింది. త్వరలోనే సీజన్‌ 9 ప్రారంభం కానుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు