Bigg Boss Elimination: ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో టాప్ సెలబ్రెటీ!

బిగ్ బాస్ సీజన్ 9 ''చదరంగం కాదు.. రణరంగమే'' అన్నట్లుగానే గేమ్ రసవత్తరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీలుగా రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు.

New Update

Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 9 ''చదరంగం కాదు.. రణరంగమే'' అన్నట్లుగానే గేమ్ రసవత్తరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీలుగా రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటికే సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ పూర్తవగా.. ఎవరూ ఊహించని విధంగా సంజన బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ గా నిలిచింది. ఇక కెప్టెన్ ఎవరో తెలిసిపోయిన తర్వాత.. అందరూ ఆసక్తిగా ఎదురుచూసే మరో ఘట్టం ఎలిమినేషన్. మొదటి వారం మొత్తం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళలో ఇంటి నుంచి బయటకు వెళ్ళబోయే మొదటి కంటెస్టెంట్ ఎవరనే దానిపై నెట్టింట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం  సోషల్ మీడియాలో వస్తున్న ఆన్ లైన్ పోల్స్ ప్రకారం ఈ వారం ఓటింగ్ లో టాప్ ఎవరు? డేంజర్ జోన్ లో ఉన్నదెవరో ఇక్కడ తెలుసుకుందాం.. 

టాప్ లో తనూజ 

ఈ వారం సంజన కామనర్స్ ఏకాభిప్రాయంతో నేరుగా నామినేటవగా.. మిగతా 8 మంది కంటెస్టెంట్లు సుమన్ శెట్టి, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్, తనూజ, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్, డిమోన్ పవన్, ఫ్లోరా షైనీ నామినేషన్ ప్రక్రియలో  ఇతర కంటెస్టెంట్ల ద్వారా నామినేట్ చేయబడ్డారు. వీరిలో సీరియల్ నటి తనూజాకు భారీ ఓటింగ్ పడుతోంది. ఈమెకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమ్ ఉండడంతో పాటు హౌజ్ లో గేమ్ కూడా బాగానే ఆడుతుంది. టాస్కులో పాల్గొనడం, పనులు చేయడం, ప్రతీ ఆర్గుమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఇలా ఏదో ఒక రకంగా కంటెంట్ ఇస్తూనే ఉంది. దీంతో తనూజాకు గట్టిగానే ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఓట్లు పడుతున్నాయి. ఈయన హౌజ్ లో అసలు యాక్టీవ్ గా లేకపోయినా.. ఉన్నంతలో జనాలకు జెన్యూన్ గా కనిపిస్తున్నారు. అందుకే ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్ సంజనకు ఓట్లు పడుతున్నాయి.   ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించిన సంజన.. ఒక్కసారిగా చక్రం తిప్పింది.  తన ఆట తీరుతూ బిగ్ బాస్ గేమ్ ఛేంజర్ గా మారింది. హౌజ్ మేట్స్ షాక్.. సంజన రాక్స్ అనేలా చేసింది. ఈ దెబ్బతో సంజన ఓట్ బ్యాక్ కూడా అమాంతం పెరిగింది. దీంతో ఫస్ట్ వీక్ సంజన ఎలిమినేట్ అవ్వడానికి నో ఛాన్స్. ఇక ఫోర్త్ ప్లేసులో డిమోన్ పవన్ ఆ తర్వాత రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్ కి ఓట్లు పడుతున్నాయి. 

డేంజర్ జోన్లో.. 

ఇప్పటివరకు వచ్చిన  ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం .. ఫ్లోరా షైనీ, శ్రేష్టి వర్మ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ అందరికంటే చాలా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ ఓ వీళ్ళ గేమ్ కూడా అలాగే ఉంది. శ్రేష్టి, ఫ్లోరా కంటెంట్ కాదు కదా, కనీసం మాట్లాడినట్లుగా కూడా కనిపించడం లేదు ప్రేక్షకులకు. ఆ గుడ్డు గొడవలో సంజనను 'సిగ్గులేదా' అని అనడం తప్పా శ్రేష్టి కంటెంట్ పెద్దగా ఏమి లేదు. దీంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 

Also Read: Nayanthara: చిరుకు చుక్కలు చూపిస్తున్న నయనతార.. వామ్మో! 'వర ప్రసాద్' సినిమాకు ఇన్ని కండిషన్లా?

Advertisment
తాజా కథనాలు