Bigg Boss Buzz: దమ్ముంటే టచ్ చేయి, తంతా.. బజ్ లో దమ్ము శ్రీజ వర్సెస్ మంగపతి! ఫుల్ మాస్

బిగ్ బాస్ సీజన్ 9 ఇక నుంచి మరింత రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ ఫైర్ స్ట్రామ్ పేరుతో ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

New Update

Bigg Boss Buzz: బిగ్ బాస్ సీజన్ 9 ఇక నుంచి మరింత రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ ఫైర్ స్ట్రామ్ పేరుతో ఏకంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో మరో ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ను బర్తీ చేయడానికి.. డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు పంపించేశారు బిగ్ బాస్. నటి ఫ్లోరా, అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన  దమ్ము శ్రీజ ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. 

మంగపతి ఫైర్ 

ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ, ఫ్లోరా.. శివాజీ బజ్ షోలో పాల్గొన్నారు. షోలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులకు, వాళ్ళ ఆటతీరుకు  ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. షోలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను హోస్ట్ నాగార్జున ఎత్తిచూపితే.. బజ్ లో మన మంగపతి శివాజీ ఆపని చేస్తారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని బజ్ కి పిలిచి తనదైన స్టైల్లోఇచ్చిపడేస్తారు. ఈ వారం దమ్ము శ్రీజ, ఫ్లోరాపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా దమ్ము శ్రీజ దుమ్ముదులిపారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. 

దమ్ముంటే టచ్ చేయ్.. 

ప్రోమో స్టార్ట్ అవ్వగానే.. ఈ రోజు బజ్ కి ఒక్కరు కాదు ఇద్దరు రాబోతున్నారు అంటూ షో మొదలు పెట్టారు హోస్ట్ శివాజీ.  ఆ తర్వాత శ్రీజపై ప్రశ్నల బాణాలు విసిరారు. నువ్వు  కామనర్స్, సెలబ్రెటీస్ అని గట్టిగా మనసులో పెట్టుకున్నావు.. అదే నీ ఎలిమినేషన్ కి కారణం! అని గట్టిగా చెప్పారు శివాజీ. దీనికి శ్రీజ.. నేను షోలో ఒక్కసారి మాత్రమే అలా అన్నాను అంటూ బదులిచ్చింది. అయినా శివాజీ ఆగలేదు.. నీ గేమ్ కి మైనస్ అదేనని నొక్కి చెప్పారు. ఇక్కడితో శివాజీ ఆగలేదు.. 'గేమ్స్, ఎమోషన్స్, టాస్కులు.. ఎందులో నువ్వు సరిగ్గా ఆడావు అని ప్రశ్నించారు. ఇక శ్రీజ కూడా ఏ మాత్రం తగ్గలేదు..  ఒక మనిషిని నువ్వు నెగిటివ్.. నువ్వు నెగటివ్.. నువ్వు ఎవరికీ సెట్ కావు.. నీతో మాట్లాడకూడదు అంటే ఆటోమేటిక్ గా ఎవరైనా డౌన్ అవుతారు. హౌజ్ లో నాకు జరిగింది అదే అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బెడ్ టాస్క్ లో శ్రీజ, దివ్యకు మధ్య జరిగిన గొడవ గురించి ప్రశ్నించారు.  దమ్ముంటే ఆడు, దమ్ముంటే టచ్ చెయ్, తంతా అంటూ దివ్య తనతో మాట్లాడడం గురించి శ్రీజ వివరణ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే.. వైల్డ్ కార్డ్స్ లో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష ఎంట్రీలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో దివ్వెల మాధురి పలు ఇంటర్వ్యూస్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. తన అభిప్రాయాలను బలంగా, ముక్కుసూటిగా చెబుతూ ఫుల్ కాంట్రవర్షియల్ అవుతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఈమె ఎంట్రీతో షో మరింత వేడెక్కనుంది. 

Also Read: CINEMA: ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కానీ చూడాలంటే ఒక కండీషన్

Advertisment
తాజా కథనాలు