CINEMA: జాన్వీ కపూర్- సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పరం సుందరి' ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అద్దె ప్రాతిపదికను ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. సినిమా చూడాలనే వారు రూ. 349 చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఫుల్ టైం స్ట్రీమింగ్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
#ParamSundari (Hindi)
— OTT Trackers (@OTT_Trackers) October 10, 2025
Now available for Rent on Primevideo 🍿!!#OTT_Trackerspic.twitter.com/UZpNyMCqwd
తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ, రెంజీ పనికర్, సిద్ధార్థ శంకర్, మంజోత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ దీనిని నిర్మించారు. సినిమాలో జాన్వీ కాస్ట్యూమ్స్, లొకేషన్స్, విజువల్స్, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. సుందరి పాత్రలో జాన్వీ నటన, అమాయకత్వం, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. జాన్వీ గత సినిమాలకంటే ఈ సినిమాలోని ఆమె పాత్ర, కథాంశం బిన్నంగా కనిపించింది.
Also Read: Mithra Mandali Premieres: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్