OG Pre Release: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఫుల్ హైపెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ బయటకు వచ్చింది. 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా ఏర్పాటు చేశారు మేకర్స్. ఏకంగా రెండు వెన్యూలలో పర్మిషన్ తీసుకున్నారు. వర్షం ఉంటే శిల్ప కళా వేదికగా.. వర్షం లేకపోతే LB స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. విజయవాడ లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అనుమతులు ఇంకా రాలేదని సమాచారం.
Dear OG fandom 😎
— DVV Entertainment (@DVVMovies) September 20, 2025
⁰#OGConcert is LOCKED for tomorrow in Hyderabad 🔥🔥
Let’s celebrate in the most electrifying way ever…Venue details dropping soon… stay tuned. #TheyCallHimOG#OG
Also Read: Oscar Awards 2026: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప..!