/rtv/media/media_files/2025/09/07/bigg-boss-9-telugu-promo-released-2025-09-07-09-57-27.jpg)
Bigg Boss 9 Telugu Promo Released
బిగ్ బాస్ సీజన్ 9 (BIGG BOSS 9 Telugu) ప్రారంభమైంది. తాజాగా ఈ సీజన్ గ్రాండ్ లాంఛ్ ప్రోమోను విడుదల చేశారు. గతం కంటే ఈ సీజన్ మరింత గ్రాండ్‌గా, ఎవరూ ఊహించని విధంగా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఈ ప్రోమోలో సెలెబ్రెటీలను మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ కొందరి ఫేస్‌లు మాత్రమే రివీల్ చేశారు. ఇటీవల శ్రీముఖి హోస్ట్‌గా నవదీప్, అభిజిత్, బిందు మాదవి జడ్జిలుగా వ్యవహరించిన షో ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’. ఇందులో ఫైనలిస్ట్‌లుగా నిలిచిన టాప్ 13 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ స్టేజ్‌పై చూపించారు.
Bigg Boss 9 Telugu Promo
ఆ 13 మందితో మాట్లాడి.. నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపిస్తున్నారు. మిగతా కంటెస్టెంట్ల ఫేస్‌లు మాత్రం రివీల్ చేయలేదు. రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం.. ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు, డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది Bigg Boss Season 9 అంటూ నాగార్జున మాస్ లుక్ రివీల్ చేశారు. అందులో కింగ్ నాగార్జున ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
ఆ తర్వాత ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. దాదాపు అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల అందరినీ చూపించారు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూపించి అలరించారు. అనంతరం ఆశ ఒకపక్క.. ఆశయం ఒకపక్క.. మరి ఈ రణరంగం చూడ్డానికి మీరు సిద్ధమా అంటూ నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
Commoners with raw fire 🔥 vs Celebrities with star power ✨ Double surprises 💥 Double entertainment 🎭 Double the dose of Bigg Boss 👁️💥
— Starmaa (@StarMaa) September 7, 2025
Catch the Grand Launch of #BiggBossSeason9 Tonight at 7PM on #StarMaa#BiggBossTelugu9#BiggBossTelugu9GrandLaunchpic.twitter.com/QRy6zQ7X7R
ఆపై నాగార్జున కూడా బిగ్ బాస్ హౌస్‌లో వెళ్లడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందులో ‘‘ఇప్పటి వరకు నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుడ్ని చూశారు. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు.’’ అని బిగ్ బాస్ చెప్పే డైలాగ్ తర్వాత ‘‘నేను దేనికైనా సిద్ధమే’’ అంటూ నాగార్జున్ చెప్పడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో రెండో హౌస్‌ను చూపించారు. ఇంకా డ్యాన్స్‌లు, గేమ్స్ వంటివి చూపించారు. అలా ఒక్కో కంటెస్టెంట్‌తో నాగార్జున మాట్లాడి వారిని హౌస్‌లోకి పంపించడం చూడవచ్చు. అయితే సీజన్ మొదట్లోనే ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోయినట్లు చూపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశారు. అనంతరం నాగార్జున తన డైలాగ్‌లతో అదరగొట్టేశాడు. మొత్తంగా ఈ సీజన్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది.