The RajaSaab Trailer: మొత్తం పోతారు.. రాజాసాబ్ ట్రైలర్ అరాచకం అంతే! మూడు నిమిషాలు రచ్చ రంబోలా

డార్లింగ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్  'రాజాసాబ్' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. హారర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో ఆరగొడుతోంది.

New Update

డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయా ల కుట్టి మల్విక మోహన్, నిధి ఆగర్వాల్, రిద్ది కుమార్ ఫీమెల్ లీడ్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నింటి కలయికతో రాజాసాబ్ రూపొందుతోంది. సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ సీక్వెల్స్ మధ్యలో ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు డార్లింగ్ ప్రభాస్. 

రాజాసాబ్ తో పాటు మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. బహుబలి ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండు మూడు సినిమా షూట్స్ లో పాల్గొంటూ క్షణం తీరిమ లేకుండా గడుపుతున్నారు. 

Also Read: Raja Saab Trailer: 'రాజా సాబ్' భారీ అప్‌డేట్.. ప్రభాస్ ఇంట్రో సాంగ్ కంప్లీట్, ట్రైలర్ రెడీ!

Advertisment
తాజా కథనాలు