Bigg Boss Telugu: ఫుల్ ఎమోషనల్.. బిగ్ బాస్ ఇంట్లో తనూజ చెల్లి పెళ్లి కూతురు వేడుక !

బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వచ్చేసింది. గత 10 వారాల పాటు ఫ్యామిలీస్, బయట ప్రపంచానికి దూరంగా ఉన్న కంటెస్టెంట్స్ ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కలుస్తారు.

New Update

Bigg Boss Telugu: బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వచ్చేసింది. గత 10 వారాల పాటు ఫ్యామిలీస్, బయట ప్రపంచానికి దూరంగా ఉన్న కంటెస్టెంట్స్ ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కలుస్తారు. కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ రాకతో బిగ్ బాస్ హౌజ్ సందడిగా మారనుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తనూజ ఫ్యామిలీ హౌజ్ లోకి ఎంటర్ అయ్యింది. ముందుగా తనూజ అక్క కూతురు హౌజ్ లోకి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఆ తరవాత తనూజ చెల్లి ఎంటర్ అవ్వగానే ఆమె ఫుల్ ఎమోషనల్ అయ్యింది. చెల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే మరి కొన్ని రోజుల్లోనే చెల్లి పెళ్లి ఉండడడంతో తనూజ ఎమోషనల్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ తనూజకు హౌజ్ లోనే తన చెల్లిని పెళ్లి కూతురు చేసే అవకాశం కల్పించారు. 

Also Read: Nayanatara NBK 111: హిస్టరీ రిపీట్స్..! మరోసారి బాలయ్య సరసన నయనతార..

Advertisment
తాజా కథనాలు