Nayanatara NBK 111: హిస్టరీ రిపీట్స్..! మరోసారి బాలయ్య సరసన నయనతార..

బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబోలో 'Veera Simha Reddy' తర్వాత మరో గ్రాండ్ హిస్టారికల్ ఎపిక్ తెరకెక్కుతోంది. నయనతార కీలక పాత్రలో కనిపించనున్నారు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. భారీ నిర్మాణం, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేకత కానుంది.

New Update
Nayanatara

Nayanatara NBK 111

Nayanatara NBK 111: తన అభిమానులను ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలతో ఆకట్టుకునే  నందమూరి బాలకృష్ణ, తన కొత్త సినిమా కోసం మరోసారి దర్శకుడు గోపిచంద్ మలినేనితో జతకట్టారు. వీరి గత చిత్రం Veera Simha Reddy తర్వాత, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక గ్రాండ్ హిస్టారికల్ ఎపిక్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాను వెంకట సతీష్ కిలోరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇది ఎప్పుడూ చూడని స్థాయిలో భారీగా తెరకెక్కుతోందని టాక్. అయితే తాజాగా ప్రఖ్యాత నటి నయనతార ఈ సినిమాలో చేరినట్లు అధికారికంగా వెల్లడించారు.ఈ విషయాన్నీ ఆమె పుట్టిన రోజు కానుకగా తెలిపారు.

నయనతార, బాలకృష్ణ ఇప్పటికే Simha, Jai Simha, Sri Rama Rajyam వంటి చిత్రాలలో కలిసి నటించగా, మళ్ళీ వీరు జతకట్టడం అభిమానులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. నయనతార పాత్ర కథలో ముఖ్యమైనది, కాబట్టి ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది.

హిస్టారికల్ డ్రామాగా NBK 111

గోపిచంద్ మలినేని ఈ చిత్రంతో మొదటిసారి హిస్టారికల్ డ్రామా తరహాలో ప్రయత్నిస్తున్నాడు. అందువల్ల ఈ సినిమా ఎమోషన్స్, యాక్షన్, పెద్దస్థాయి కథనం కలిపి ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇవ్వనుంది.

అయితే, Akhanda 2 రిలీజ్, ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత, బాలకృష్ణ కొత్త సినిమా షూట్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఈ సినిమా కోసం భారీ ఉత్సాహం నెలకొంది. బాలకృష్ణ, నయనతార కలసి తెరపై వచ్చే ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కలయిక, నయనతార కీలక పాత్ర, భారీ నిర్మాణం, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీగా ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులు ఈ మాస్ హిస్టారికల్ ఎపిక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు