/rtv/media/media_files/2025/09/09/day-1-episode-rithu-chowdary-love-track-with-soldier-pawan-kalyan-1-2025-09-09-07-38-39.jpg)
DAY 1 episode rithu chowdary love track with soldier pawan kalyan
బిగ్ బాస్ సీజన్ 9 షురూ అయింది. కంటెస్టెంట్లు హోరా హోరీగా తమతమ పంచులు, మాటలు, డైలాగ్‌లతో అలరిస్తున్నారు. ఇక ఇది స్టార్ట్ అయి ఒక్కరోజు మాత్రమే అయింది. ఈ ఒక్కరోజులో మాస్క్ మ్యాన్ హరీష్ సింగిల్ హ్యాండ్‌తో మార్కులు కొట్టేశాడు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో అతడే హైలైట్‌గా నిలిచాడు అనుకుంటే కాస్త పొరబడినట్లే. ఎందుకంటే మధ్యలో చిన్న రొమాంటిక్ సీన్ కూడా నడిచిందండోయ్.
Bigg Boss 9 Telugu DAY 1 episode
మన జబర్దస్త్ రీతూ చౌదరీ మొదటి రోజు నుంచే లవ్ ట్రాక్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా ఎవరితో అనుకుంటున్నారా?.. జవాన్ పవన్ కళ్యాణ్‌తో. ఈ మొదటి ఎపిసోడ్ మధ్యలో గేమ్ ఆడదామని చెప్పి.. కోరకళ్లతో మనోడిని బుట్టలో దించేయాలని చూసింది. కానీ మనోడు మాత్రం ఎక్కడా పడలేదు. bigg boss సీజన్ 9లోని తొలిరోజు ఈ సీనే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సీన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
సాధారణంగా బిగ్ బాస్ ప్రతి ఒక్కరికీ నచ్చడానికి ప్రధాన కారణం.. హౌస్‌లో గొడవలు, కొట్లాటలు, అర్థరాత్రి గుసగుసలు, చిన్నపాటి రొమాన్స్‌లు, లవ్ ట్రాక్‌లు, అలకలు, కులుకులు. ఇవే ప్రతి ఒక్కరినీ ఈ రియాల్టీ షో చూసేందుకు ఆకర్షిస్తున్నాయి. గత సీజన్ మొత్తం చూసుకుంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అందరినీ అలరించింది. ఆ తర్వాత విష్ణు ప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్ ఓ రేంజ్‌లో నడిచింది. మరి ఈ సీజన్‌లో అలాంటి లవ్ కపుల్ ఎవరుంటారబ్బా అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. నేనున్నానంటూ రీతూ చౌదరి లవ్ ట్రాక్ మొదలెట్టింది.
డే1 ఎపిసోడ్‌లో.. కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్‌తో ఒక గేమ్ ఆడుదామని అతడిని ఒప్పించింది. సరే ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాడు. తమ ఇద్దరిలో కళ్లు ఆర్పకుండా ఒకరినొకరు ఎంతసేపు చూస్తారో చూద్దామని రీతూ ఛాలెంజ్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. దీంతో వీరి గేమ్ చూసేందుకు మిగతా కంటెస్టెంట్లు చుట్టూ చేరారు.
గేమ్ స్టార్ట్ అయింది. రీతూ చౌదరి.. పవన్ కళ్యాణ్ కళ్లల్లో కళ్లు పెట్టి అలా చూస్తూ ఉంది. అదే సమయంలో మనోడు కూడా రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. అప్పుడే మనోడిని డిస్ట్రాక్ట్ చేయడానికి రీతూ గట్టిగా ట్రై చేసింది. మధ్య మధ్యలో రొమాంటిక్ చూపులు విసిరింది. ఓర చూపులు రువ్వింది. చిన్న చిన్నగా స్మైల్ కూడా చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా బోల్తా పడలేదు. చివరికి మనోడు కళ్లు ఆర్పేలా లేడని గుర్తించిన రీతూ.. తన కళ్లల్లో నుంచి నీళ్లు రావడంతో కళ్లు మూసేసింది. ఇది కేవలం రెండు నిమిషాలే అయినా ఎపిసోడ్ హైలైట్ అయింది. చూడాలి మరి వీరి ట్రాక్ ఎక్కడివరకు వెళ్తుందో.