BIGG BOSS 9 PROMO: గుండు అంకుల్ అన్నాడు గూబ పగిలేలా కౌంటర్! ఇమ్యాన్యుయేల్ కి ఇచ్చిపడేసిన మాస్క్ మ్యాన్

నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజే సెలబ్రెటీ, కామన్ మధ్య చిచ్చు రేగింది.

New Update

BIGG BOSS 9 TELUGU:  నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజే సెలబ్రెటీ, కామన్ మధ్య చిచ్చు రేగింది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ప్రోమో విడుదల చేయగా.. ఇమ్యాన్యుయేల్- మాస్క్ మ్యాన్ హరిత హరీష్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపించింది. ఇమ్యాన్యుయేల్ హరిత హరీష్ ని గుండు అంకుల్ అనడంతో గొడవ మొదలైంది. ఇమ్మూ కామెడీగానే అన్నప్పటికీ మాస్క్ మ్యాన్ మాత్రం సీరియస్ అయ్యాడు. బాడీ షేమింగ్ చేస్తే ఊరుకోను అంటూ ఇమ్యాన్యుయేల్ కి ఇచ్చేపడేశాడు. ఎవరు అంకుల్, ఎవరు గుండు మాటలు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలు పెట్టారు. నటుడు భరణి శంకర్ వీరిద్దరిని కూల్ చేసే ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. 

Advertisment
తాజా కథనాలు