Priyank Sharma: విషాదం.. ‘బిగ్ బాస్' కంటెస్టెంట్ తండ్రి కన్నుమూత

ప్రముఖ రియాలిటీ షో హిందీ ‘బిగ్ బాస్ 11’ ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రియాంక్ శర్మ తీవ్ర విషాదం‌లో మునిగిపోయాడు. ఆయన తండ్రి 59 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని ప్రియాంక్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

New Update
bigg boss 11 fame priyank sharma father died

bigg boss 11 fame priyank sharma father died

ప్రముఖ రియాలిటీ షో హిందీ ‘బిగ్ బాస్ 11’ ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రియాంక్ శర్మ తీవ్ర విషాదం‌లో మునిగిపోయాడు. ఆయన తండ్రి 59 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని ప్రియాంక్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అదే సమయంలో ప్రియాంక్ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను తన అభిమానులతో పంచుకున్నాడు. 

priyank sharma father died

ఇందులో భాగంగా తండ్రితో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘ నాన్న బాగా నిద్రపోండి. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలి (1966-2025)’’ అంటూ ప్రియాంక్ తన భావోద్వేగ పోస్టును పంచుకున్నాడు. 

అయితే తన తండ్రి ఆకస్మిక మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక్ వెల్లడించలేదు. ఈ పోస్టు వైరల్ కావడంతో సినీ పరిశ్రకు చెందిన పలువురు ప్రముఖులు ప్రియాంక్ శర్మకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రియాంక్ మాజీ ప్రియురాలు సైతం స్పందించి ధైర్యంగా ఉండు అంటూ కామెంట్ చేసింది. ఆమెతో పాటు మరికొందరు సంతాపం తెలిపారు. 

ఇదిలా ఉంటే నటుడు ప్రియాంక్ శర్మ మొదట ‘ఎంటీవీ రోడీస్ రైజింగ్’ వంటి షోతో అందరికీ పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘స్ప్లిట్స్ విల్లా 10’తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీని అనంతరం సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ 11’ వంటి రియాలిటీ షో ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 

Advertisment
తాజా కథనాలు