కొండా సురేఖ ఇటీవల అక్కినేని ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు ఎలాంటి వివాదానికి దారి తీశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ అంతా తప్పు బట్టింది. ఇక అక్కినేని ఫ్యామిలీ అయితే ఆమెపై ఏకంగా కేసు ఫైల్ వేసింది. ఈ మేరకు నాగార్జున కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని, కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా నాగార్జున పిటిషన్ పై నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున న్యాయవాది సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టుకు తన వాదనలు వినిపించారు.
Also Read : జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా
కోర్టు కీలక ఆదేశాలు..
దీంతో కోర్టు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ ను రేపు రికార్డ్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు న్యాయవాది అశోక్ రెడ్డి.. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపే నమోదు చేయాలని కోర్టును కోరారు. కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. కాగా నాగార్జున రేపు కోర్టుకు హాజరు కానున్నారు.